జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19
మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని స్లేట్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైస్ మిల్ ఆపరేటర్ గా పని చేస్తున్న లక్ష్మణ్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న జన్నారం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బందికి లక్ష్మణ్ కృతజ్ఞత తెలిపారు