టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
*సంబేపల్లి, జనసముద్రం సెప్టెంబర్ ,19:
రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం సంబేపల్లి మండలం సంబేపల్లిలో నీటి ఎద్దడి నివారణకు టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నూతన బోరును ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజులలోనే నియోజకవర్గంలో దాదాపు 58 బోర్లు వేయడం జరిగిందన్నారు.
ప్రజల కోరిక మేరకు ఎక్కడ నీటి సమస్య ఉన్న పరిష్కరించేందుకు ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గంలో నీరు, డ్రైనేజీ, కరెంటు తదితర సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.