దగ్గరి ఆత్మీయన్ని కోల్పోయాను.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 15సెప్టెంబర్
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకున్ని కోల్పోయిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఒక ప్రకటనలో కన్నీటి పర్యంతమయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి వెన్నంటు ఉంటూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నాయకుడు.
తుమ్మేటి సమ్మిరెడ్డి తన ఆప్తమిత్రుడని మంత్రి పొన్నం అభివర్ణించారు.
తుమ్మేటి సమ్మిరెడ్డి అకాల మరణంతో జమ్మికుంట పట్టణ ప్రజలు, అభిమానులు, సన్నిహితులు కన్నీటి రోదనలతో మునిగి పోయారు.
ఈ అంతిమ యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జమ్మికుంట పట్టణ పుర ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.