. సెప్టెంబర్ 14 (జనసముద్రంన్యూస్ చింతపల్లి)
చింతపల్లి మండల పరిధిలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమ్ మర్రిగూడ టీం 1-ద్వారా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దయానంద్, డాక్టర్ హరిప్రియ విద్యార్థులకు ఆరోగ్య పరిశీలన చేసి అవసరమైన మందులు అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్ , మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కే ద్వారా పాఠశాలలలో, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు, ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని ఇందులో పుట్టుకతో వచ్చే లోపాలు మెంటల్ సమస్య హార్ట్ ప్రాబ్లం ఉన్న ఏ సమస్యకైనా వైద్యం అందిస్తామని తెలుపుతూ సమస్య తీవ్ర తరం అయితే రిఫరెన్స్ సెంటర్, వారి వాహనంలోనే తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంఓఓ ఉమా, ఫార్మసిస్టు ప్రవళిక, ఏఎన్ఎం సరోజ, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ చారి, పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…