ఎల్కతుర్తి ఆగస్టు 21 జన సముద్రం న్యూస్
ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు ,7 తులాల బంగారం, చోరీ ఆగస్టు 2న జరిగిందని సీఐ పులి రమేష్ తెలిపారు. బుధవారం నిందితుని పట్టుకొని, అతని వద్ద నుండి ఏడు తులాల బంగారం, 15 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, మండలంలోని దండేపల్లి గ్రామానికి చెందిన కోదాటి ప్రమీల ఇంటిలో ఎవరు లేని సమయం చూసి, నాయినేని కనకారావు దొంగతనం చేసినట్లు ఆయన తెలిపారు. నూతనంగా సిఐ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటబడి వారం రోజుల్లో కేసును చేదించారు. సి సి ఎస్ ,సి ఐ, అబ్బయ్య, ఎస్సై గోదారి రాజుకుమార్, హెలికాన్స్టేబుల్, మల్లేశం సిబ్బంది కృష్ణమోహన్, భాస్కర్, ఉన్నారు. ఎస్సై గోదారి రాజుకుమార్ ను సీఐ ఫులి రమేష్ అభినందించారు