కూకట్ పల్లి ప్రతినిధి, జన సముద్రం ఆగస్టు 18
124 డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారి ఛత్రపతి శివాజీ నగర్ వద్ద మ్యాన్ హోల్ పొంగి వరద నీరు రోడ్డు మీదకు ప్రవహిస్తున్న నేపద్యంలో అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి డివిజన్ 9 జేఎన్టీయూ కూకట్ పల్లి జిఎం ప్రభాకర్ రావు, డీజీఎం నాగప్రియ తో కలిసి పరిశీలించడం జరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సమస్య ఇంకా పెరగడంతో కార్పొరేటర్ రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించి అర్ధరాత్రి సమయంలో చేపట్టిన మరమ్మతు పనులను రాత్రంతా దగ్గరుండి చూసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా కొనసాగుతున్న పనులను కార్పొరేటర్ జలమండలి అధికారులతో కలిసి ఉదయం నుండి అక్కడే ఉండి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత రెండు రోజులనుండి కురుస్తున్న భారీ వర్షాలకి మహంకాళి నగర్ వద్ద డ్రైనేజ్ పొంగి మ్యాన్ హోల్ నుండి వాటర్ రివర్స్ అయ్యి రోడ్డు పైకి ప్రవహిస్తుందని అన్నారు. ఇప్పటికే జి.ఎచ్.ఎం.సి సిబ్బంది ఎయిర్ టెక్ యంత్రం సహాయంతో డ్రైనేజ్ లోని పూడికను క్లీన్ చేయడంతో వరద నీటి ప్రవాహ వేగం తగ్గిందని, మరమ్మత్తు పనులు పూర్తికాక ముందే నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి సమస్య ఇంకా తీవ్రమైయిందని అన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్న సహాయక సిబ్బందిని కార్పొరేటర్ అభినందించారు. కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు ఏఈ శ్రావణి, మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





