జూలై 23 (జనసముద్రంన్యూస్ చింతపల్లి ).
చింతపల్లి గ్రామానికి చెందిన పేర్ల వెంకట్ రెడ్డి తండ్రి జంగారెడ్డి, వయసు 51 సంవత్సరాలు చింతపల్లి మండలం కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు అప్పుల బాధతో తీవ్ర మనోవేదనకు గురి అయి తన మెకానిక్ షాపు (డబ్బా) లో ఆదివారం రోజు రాత్రి సమయంలో వైరుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అతని భార్య పేర్ల రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా చింతపల్లి మండల ఎస్సై బి యాదయ్య తెలియజేశారు