తోట రాముడు డిసైడ్ చేస్తేనే బ్యాంక్ రుణాలు

Spread the love

జన సముద్రం దిన పత్రిక ప్రతినిధి,మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, జూలై 23:

,తోట రాముడు సెటిల్ మెంట్ లు చేస్తాడని సినిమాలలో చూసాం కాని నిజ జీవితం లో కూడా అక్కడక్కడ మచ్చుకు కనబడుతున్నారు.
బ్యాంకులలో దళారులను అనుమతించవద్దని రేచిని గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్, భావనపల్లి సంతోష్లు యూనియన్ బ్యాంకు మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ ఎం మంచిర్యాలకు తాండూర్ మేనేజర్ కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళారుల దందాపై ఈనెల 20 తారీకున రేచిని బ్యాంకులో సి సి కెమెరా ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని
రేచిని,ఐబి తాండూర్ గ్రామములో ఉన్న బ్యాంక్ ల సేవలు దళారుల చేతుల్లోకి వేళ్ళాయని ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు యొక్క సేవలు బ్యాంకు రుణాలు, లావాదేవీలకు సంబందించిన కార్యకలాపాలు కొద్దిమంది చేతుల్లో నడుస్తున్నాయని రేచిని గ్రామములో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఇష్ట్యా రీతిలో వ్యవహరిస్తు వారికి నచ్చిన వ్యక్తులకు లోన్స్ ఇవ్వడం మరియు తోట రాముడు ( మారుపేరు ) అనే వ్యక్తి ఓక దళారి ఏమి చెప్పితే అది తూచా తప్పకుండ పనిచేసే బ్యాంకు మేనేజర్ సాధారణ మనిషి బ్యాంకు కి వెళ్లి ఏదైనా లోన్ కావాలన్నా మరియు ఆఖరికి క్రాప్ లోన్ కావాలన్నా క్రాప్ లోన్ రేనివల్ చేయాలన్న ఈ తోట రాముడు చెపితే గాని బ్యాంకు కార్యకలాపాలు ముందుకు సాగవని మేన్ బ్యాంకు అధికారులకి ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ వేరు ఇక్కడి బ్యాంకు లో జరుగుతున్నా పరిణామాలు వేరు అది ఏంటంటే రేచిని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాన్ ఫర్ ఫోర్మింగ్ అసిస్ట్ ఎన్పిఎ లో మీ బ్యాంకు వాళ్ళు జరిపించే ఆడిట్ రిపోర్ట్ లో మంచి పేరు ఉంది అని బ్యాంకు అధికారులు నమ్ముతున్నారు. కానీ ఇక్కడ వేరేవిదంగా జరుగుతుంది. అదేంటంటే ఉదాహరణకి ఒక రైతు లక్ష రూపాయలు వ్యవసాయ అవసరాల నిమిత్తం కొరకు లోన్ తీసుకుంటే సంవత్సరం తర్వాత లక్షరూపాయలు అసలు మరియు వడ్డీ, అదనంగా లోన్ రిన్వల్ చేసినందుకు 3,000/- రూపాయలు, సదరు వ్యక్తి దళారి అయినా తోట రాముడు రైతుల నుండి లంచం తీసుకుంటున్నాడని అన్నారు. అంటే ఈ విదంగా ఒక బ్యాంకులో చూస్తే రేచిని గ్రామీణ బ్యాంకు లో ఇంచు మించుగా సుమారుగా 500 మంది రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం కొరకు వ్యవసాయ లోన్స్ తీసుకోని ఉన్నారు. నిరక్షరాశులయిన ఎస్సీ,ఎస్టీ ,బిసి రైతుల నుండి అదనంగా 1,50,000,00 (ఒక కోటి యాభై లక్షల రూపాయలు) వసూలు చేస్తున్నాడని తెలిపారు.మరి ఇలా చేసిన డబ్బులు దళారి ఒక్కడే తీసుకుంటున్నాడా? లేఖ ఇందులో బ్యాంకు మేనేజర్ కి కూడా వాటా ఇస్తున్నాడా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలి పోతుంది. ఎందుకంటే ఈ దళారి వ్యక్తి బ్యాంకు మేనేజర్ కి వాటా ఇవ్వక పొతే ఈ తోట అనే వ్యక్తినీ బ్యాంకు మేనేజర్ బ్యాంకు లోపల ప్రతి రోజు గంటల పాటు బ్యాంకు కార్యకలాపాల సమయం ముగిసే వరకు బ్యాంకు లో ఉంచటం చూస్తే అర్ధం అవుతుందని బ్యాంక్ లో సిసి కెమోరాలు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ తోట అనే వ్యక్తి ఏమైనా బ్యాంకు ఎగ్జామ్స్ రాసి బ్యాంకు ఉద్యోగం పొందడా? అనేది రెచిని, తాండూర్ గ్రామాలలో చర్చనీయాశంగా మారింది. ఇవే కాకుండా ఇతని ఫైనాన్స్ దందా ఏ విధంగా ఉంటుందంటే బ్యాంకు వినియోగదారుల ప్రమేయం లేకుండా సదరు వ్యక్తి అకౌంట్ యొక్క చెక్ బుక్ లు దగ్గర పెట్టుకొని సంతకం చేయించు కోని అకౌంట్స్ నుండి ఈ తోట అనే దళారి డబ్బులు డ్రా చెయ్యడం పై సదరు బ్యాంకు మేనేజర్ నీ ప్రజలు అడిగితె నాకు సంబంధం లేదు క్యాష్ఇయర్ కి తెలుసు అని సమాధానం ఇస్తున్నాడని, బ్యాంక్ వారు వినియోగదారుల ఆర్థిక లావాదేవీలకు సంబందించిన స్టేటుమెంట్ నీ
బ్యాంకు పాస్ బుక్ పైన ముద్రించి ఇవ్వకపోవడం అదేంటి అని బ్యాంకు సిబ్బందిని అడుగుతే ప్రింటర్ పనిచేయడం లేదని సమాధానం చెపుతుంటారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే స్వయం ఉపాధి కి సంబందించిన లోన్స్ గురించి గ్రామములో ఉన్న మహిళా సంఘాలకు గాని మరియు యువతకు గాని అందుకు సంబందించిన ఇన్ఫర్మేషన్ నోటీసు బోర్డు లో పెట్టకపోవడం మరియు బ్యాంకు మేనేజర్ కి చనువుగా వుండే వాళ్లకు మాత్రమే ఈ యొక్క అవకాశాలు దక్కుతున్నాయని ఇదే విషయం పై తోట ని స్ధానికులు అడగగా అందుకు అతను బదులిస్తూ నాకు జోనల్ మేనేజర్ తెలుసు రీజినల్ మేనేజర్ తెలుసు ఈ యొక్క బ్యాంకు నీ నేనే మన రెచిని ఊరికి తీసుకు వచ్చాను. మీరు ఎవరికైనా చెప్పుకోండి నాకు ఏమి కాదు బ్యాంకు మేనేజర్ కి ఏమి కాదు అని అన్నాడని తోట అనే వ్యక్తి రేచిని తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ లోనే కాకుండా తాండూర్ లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ లో కూడా పెత్తనం చెలాయిస్తూ రైతులను మోసం చేస్తున్నాడని అంతే కాకుండా ఇదే బ్యాంకు లో పని చేస్తున్న బ్యాంకు సిబ్బంది అనగా అటెండర్ కూడా ఒక బ్యాంకు మేనేజర్ లాగా చలామణి అవుతూ వినియోగదారులని చాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈ విషయం పైన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే బ్యాంకు మేనేజర్ మరియు అటెండర్ పైన శాఖ పరమైన చర్యలు తీసుకోని అట్లాగే సదరు వ్యక్తి అయినా తోట మీద చట్ట పరమైన చర్యలు తీసుకోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వినియోగ దారులకి విముక్తి కల్పించగలరని కోరుతున్నారు.

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం