అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్ కమ్మ వీధిలోకాపురం ఉండు మాజీ శాసనసభ్యుడు N.R.జయదేవ నాయుడు(85)తండ్రి ఎన్.కె రామానుజులు నాయుడు అనునతనికి సెల్ నెంబర్ వాట్సప్ కాల్ చేసి మేము సుప్రీంకోర్టు చేత నియమించబడిన సిబిఐ ఆఫీసర్లము అని చెప్పారు.మీ పాకాల దగ్గర మనీ లాండరింగ్ జరిగింది అందులో మీ పేరు కూడా ఉంది అని పేర్కొన్నారు.
మీ అకౌంట్లో ఉండే డబ్బులు మొత్తం మేము చెప్పే అకౌంట్ కి వేస్తే తప్ప మిమ్మల్ని వదలము మీరు వేయకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము అని బెదిరించినారు.ఎన్.ఆర్ జయదేవ నాయుడు కు గల నాలుగు SBI అకౌంట్ లు నుండి మరియు రెండు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ల నుండి మొత్తం 48,49000/- డబ్బులను వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్లకు ట్రాన్స్ఫర్ చేసి మోసం చేసినారని తెలుసుకొని సోమవారం పాకాల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు.