గురజాల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం

Spread the love

జనసముద్రంన్యూస్, మార్చి 24, పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ.

స్థానిక శుభమస్తు కళ్యాణ మంటపం లో గురజాల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో స్థానిక యమ్.యల్.ఏ కాసు మహేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో వై.సి.పి ప్రభుత్వం తరుపున యం.పి గా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ను, మరలా యం.యల్.ఏ గా పోటీ చేస్తున్న నన్ను గెలిపించమని కోరారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఈ ఐదేళ్ళ పాలనలో బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారు. నవరత్నాలు పేరుతో ప్రతి కుటుంబానికి అమ్మ ఒడి, విద్యా దీవెన తో పాటు వృధ్యాప పించన్లు , ఒంటరి మహిళలు పించన్లు ప్రతి నెలా మొదటి తేదీ నే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం ఇలా ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో మీ మన్ననలు పొందారు. గురజాల నియోజకవర్గంలో రోడ్లు, మంచినీరు,విద్య, వైద్య ,ఆరోగ్య సౌకర్యాలు ఎన్నో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కావున రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు, మీరు అందరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. వైసిపి పార్టీ ప్రజలకు ఏవిధంగా సేవలు చేసిందో , గమనించి మరోసారి జగన్ మోహన్ రెడ్డి ని, ముఖ్యమంత్రి ని చేసేందుకు కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పవిత్ర మురళీమోహన్, స్థానిక గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం విశ్వబ్రాహ్మణ నాయకులు, షుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి