ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన జగన్… “సిద్ధం” పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క పొత్తులో భాగంగా టీడీపీ – జన్సేనలు “జెండా” సభలు నిర్వహిస్తున్నారు! అయితే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రకటన విషయంలో టీడీపీ – జనసేన కూటమికి బీజేపీ ప్రకటన ఇప్పుడు అతిపెద్ద విషయంగా మారినట్లు తెలుస్తుంది.
ఏపీలో టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తులో బీజేపీ కూడా చేరాలని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని.. ఢిల్లీలోని పెద్దలతో ఎన్నో చీవాట్లు తిన్నానని.. పొత్తు కలయిన విషయంలో బీజేపీ పెద్దల వద్ద తాను పడ్డ ఇబ్బందులు తనకు మాత్రమే తెలుసని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఇప్పటివరకూ టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ జాయినింగ్ పై అధికారికంగా స్పష్టత రాలేదు! ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాత్రం.. బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయని చెబుతుంటారు! జనసేన పార్టీ.. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అని గుర్తుచేస్తుంటారు. దీంతో ఈ సందేహాలు, దానివల్ల కేడర్ లో కలిగే కన్ ఫ్యూజన్లు, ఫలితంగా వచ్చే రకరకాల సమస్యలకు చెక్ పెట్టాలని.. త్వరలో అభ్యర్థుల ప్రకటన విషయంలో పూర్తి స్పష్టత రప్పించాలని పవన్ ఫిక్సయ్యారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన హస్తిన పర్యటన ఫిక్సయ్యిందని అంటున్నారు.
అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిలీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ ఎంట్రీపై స్పష్టత తీసుకోవడానికి ఆయన పర్యటన అని అంటున్నారు. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఫైనల్ అయిన వేళ… మిగిలిన స్థానాలను బీజేపీ ఎంట్రీపై క్లారిటీ వచ్చిన అనంతరం ప్రకటించాలని చెబుతున్న నేపథ్యంలో… ఈ విషయంపై స్పష్టత కోసం పవన్ హస్తిన టూర్ అని అంటున్నారు.
ఈ టూర్ తో టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చే దిశగా పవన్ ఫైనల్ ప్రయత్నాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఆ విషయంలో స్పష్టత వచ్చేస్తే… టీడీపీ మిగిలిన స్థానాల్లోని అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తారని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… ఈసారి పవన్ హస్తిన పర్యటన అత్యంత కీలకమైనదిగానే భావించాలి!! మరోపక్క రెండో విడత అభ్యర్థుల జాబితాపైనా పవన్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ టూర్ అనంతరం ఒకటి రెండు రోజుల్లో సుమారు 10 మందితో రెండో విడత జనసేన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.