

జనసముద్రం న్యూస్ (డోర్నకల్ డివిజన్)
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం లోని వస్త్రం తండా గ్రామపంచాయతీ పరిధిలో మీటర్ కలెక్షన్ లేని గిరిజన వాసులకు స్థానిక సర్పంచి బానోత్ కళ్యాణి మరియు సిరోల్ మండల ఏ ఈ సిహెచ్ జయప్రకాష్ నారాయణ ,స్థానిక లైన్మెన్ ఎస్ శ్రీనివాస్, లైన్మెన్ బి నరేష్, ప్రజలకు గవర్నమెంట్ వారు ఇచ్చిన 101 యూనిట్లు విద్యుత్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించారు. తదుపరి 25 మంది గిరిజన వాసులు ఒకే పర్యావముగా గృహ సర్వీస్ను సర్వీస్ కనెక్షన్ ను కొరకు మీసేవ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకొనగా నేడు మీటర్లు బిగించడం జరిగింది . ఈ రిజిస్ట్రేషన్ కొరకు కావలసిన పత్రములు కుల ధ్రువీకరణ పత్రం ఇంటి పన్ను రసీదు ఆధార్ కార్డు మీసేవ నందు చెల్లించి ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఆన్లైన్లో చేసుకుని అవకాశంను వినియోగించుకోవలసిందిగా విద్యుత్ శాఖ వారు కోరడమైనది.