జనసముద్రం న్యూస్, జూన్ 20:
టూవీలర్స్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు సైతం మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో సేఫ్ రైండింగ్‌పై భారత్‌లో చాలా మందికి అవగాహన ఉండట్లేదు. ఇండియాలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక అదిరిపోయే సొల్యూషన్ తీసుకొస్తోంది.
ప్రస్తుతం చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో బెస్ట్ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైడర్ సేఫ్టీని పెంపొందించేందుకు ఓలా ఎలక్ట్రిక్ వినూత్న హెల్మెట్ డిటెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, రైడర్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఇ-బైక్ స్టార్ట్ కాదు.