
బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై మరోసారి ఐటీ అధికారులు దాడుడలకు దిగారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేతల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి చెందిన షాపింగ్ మాల్ పై ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయి. కేపిహెచ్ బి కాలనీ లోని జేసీ బ్రదర్స్ లో ఐటీ శాఖ అధికారులు ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, జేసి బ్రదర్స్ సంస్థకు డైరెక్టర్లుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంకా అతని బంధువులున్నారు.
సోదాల్లో భాగంగా..జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలు పై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కొత్తపేటలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఈ రోజు తెల్లవారు జాము నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఈ రెండు కంపెనీలకు ఆయన భార్య వనితా డైరెక్టర్ గా ఉన్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతుండడం సంచలనంగా మారింది. కొత్తపేటలోని ఆఫీస్ లతో పాటు భువనగిరిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి డీటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సడెన్ గా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు దాడులకు పాల్పడడంతో బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొంది.
అదే విధంగా..మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటితో పాటు ఆయన వ్యాపారసంస్థలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే సడెన్ గా బీఆర్ఎస్ నేతలపై ఐటీ అధికారులు ఇలా దాడులకు తెగబడడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది.






BRS valaki oka panni chetha kadu langa na kodukulu unaru raithu laki arest chesthunaru