
జన సముద్రం న్యూస్,30మే,అనంతపురం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ హరిప్రసాద్ రెడ్డి
గారిని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు రెవెన్యూ భవనం లో ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు కలిసి పుష్ప గుచ్చం ఇచ్చారు. తాము చేస్తున్న సేవల గురించి వివరించి తమకు ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కు కార్యాలయం ఏర్పాటు కు సహకరించాలి అని కోరడం జరిగింది దానికి హరిప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు.
ప్రజా స్వామ్యం కొరకు నిస్వార్థం తో పనిచేసే మీ అందరికీ అభినందలు అని కమిషనర్ గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
అనంతపురం జిల్లా
ప్రధాన కార్యదర్శి కె.అల్తఫ్,
కోశాధికారి సాంబ శివుడు,
ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు,
అనంతపురం నగర అధ్యక్షుడు
ఓబులపతి,
అనంతపురం రూరల్ ప్రధాన కార్యదర్శి
సంగా ఫణి భూషణ్,
జాఫర్, బాషా పాల్గొన్నారు.





