
అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, జనసముద్రం న్యూస్, మే18:
రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి గ్రామంలో నివాసముంటున్న ఎలక్ట్రిషన్ గోవిందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న భూమిరెడ్డి పెద్దిరెడ్డి రూ 10 వేలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారం ఉంటుందని ఏమీ అధైర్య పడొద్దని కుటుంబానికి భూమిరెడ్డి పెద్దిరెడ్డి భరోసా ఇచ్చారు.





