జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11:
1వ తేదీన ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీ వచ్చినా.. ఇవ్వకపోవడంతో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమ తమ కుటుంబాలతో సహా రోడ్డెక్కారు. శనివారం ఉదయాన్నే.. ఆయా కుటుంబాలు.. స్థానిక కలెక్టరేట్లకు వద్దకు .. తమ బాధలు చెప్పుకొని విలపిస్తున్నారు. ఈఎంఐలు కట్టకపోతే.. ఇళ్లు వేలం వేస్తారని.. తమకు గూడు కూడా కరువై పోతుందని.. వారు వగరుస్తున్నారు.
ఒకటో తేదీ రావాల్సిన జీతం పదో తేదీ దాటినా ఖాతాలో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రుణ వాయిదాల తేదీలు మార్చాలని బ్యాంకులను కోరుతున్నారు.
ఏ ఉద్యోగికైనా ప్రతినెలా ఈఎంఐలు ఇతర ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి జీతం ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ రుణవాయిదా తేదీ మార్చాలని వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో బ్యాంకు మేనేజర్కు ఉపాధ్యాయు లు వినతిపత్రం సమర్పించటం వారి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.
చలో విజయవాడ తర్వాత ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ప్రతినెలా జీతాలు ఆలస్యంగా వేయడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీస్తున్నారు.పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని జీతాల కోసం నినాదాలు చేశారు. మొత్తంగా శనివారం ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసనలకు పిలుపునివ్వడం గమనార్హం.