ఆడపిల్లలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం

Spread the love

స్త్రీల భద్రతకే మా ప్రథమ ప్రాధాన్యం: రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి మల్కాజ్గిరి ఫిబ్రవరి 09

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ. పి.ఎస్. తెలిపారు.

షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో కమిషనర్ డిఎస్. చౌహాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోందని, ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపుల వంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రత కోసం పోలీసులు షి టీమ్ ల ద్వారా ఎన్నో కార్య్రమాలను నిర్వహిస్తున్నారని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తన ను మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నారు .

ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
షి టీమ్స్ వారు గడిచిన రెండు నెలల కాలంలో ఈవ్ టీజర్ల మీద 118 కేసులు నమోదు చేశారు. వాటిలో 33 ఎఫ్ ఐ ఆర్, 41 పెట్టీ కేసులు మరియు 44 కౌన్సెలింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 247 మంది ఆకతాయిలను అరెస్టు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిపి రోడ్ సేఫ్టీ శ్రీ బాల, డిసిపి ట్రాఫిక్, శ్రీనివాస్, ఎల్.బి. నగర్ డిసిపి సాయి శ్రీ, ఎల్.బి. నగర్ ఏసిపి శ్రీధర్ మరియు
షీ టీం ఏసిపి వెంకట్ రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి