ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసిఆర్ ప్రభుత్వానికి హై కోర్ట్ లో ఎదురుదెబ్బ

Spread the love

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 06:

బీజేపీపై పోరాడుతున్న కేసీఆర్ కు కాలం కలిసిరాలేదని బీఆర్ఎస్ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరుకునపెట్టాలని చూసిన కేసీఆర్ కు న్యాయస్థానంలో చుక్కెదురైందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది.
దీంతో ఈ కేసులో బీజేపీకి అనుకూలంగా కాగా.. కేసీఆర్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి ముందడుగు వేస్తారు? సుప్రీంకోర్టుకు వెళతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సిట్ తోపాటు ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది.
సింగిల్ జడ్జి తీర్పుపై కేసీఆర్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జస్టిస్ ఎన్ తుకారాం ధర్మాసనం అప్పీల్ పై సుధీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది.
తాజాగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్