
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, జనవరి 31:
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రము లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక శిక్షణ తరగతులకు రెండవరోజు విద్యార్థి ఉద్యమం క్లాసు బోధించడానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళనాగరాజు శిక్షణ తరగతులకు హజరై విద్యార్థి నాయకులను ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడారు.
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ ..
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి విద్యార్థి అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా వుండాలంటే విద్యా రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో బకాయి లు వున్న స్కాలర్, షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ 3300కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తాళ్ల నాగరాజు తెలిపారు. విద్యారంగంలో వివిధ కోర్సు లు పూర్తిచేసుకుని పై చదువులకు వెళ్ళాలంటే ఆయా కళాశాలల యాజమాన్యాలు కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, స్టూడెంట్స్ ఫీజు కడితేనే సర్టీపికేట్లు ఇస్తామని స్టూడెంట్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాగరాజు స్టూడెంట్స్ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని తమ ఆవేదనతో వ్యక్తపరిచారు. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారనీ ఆలొచించి చదువుకునే స్టూడెంట్స్ ఒత్తిడి కి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పూనరావృతం కాకుండా వుండాలంటే విద్యా రంగానికి 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న “మన ఊరు మనబడి” ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కావాలంటే బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులకు బడ్జెట్లో30 శాతం నిధులు కేటాయించి విద్యా రంగాన్ని బలో పేతం చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ గురుకుల పాఠశాలలో మరియు కళాశాల లొ, ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువైయయని
అన్నారు. కొత్త గా ఏర్పడిన అన్ని రకాల గురుకుల పాఠశాలలకు తక్షణమే సోంత భవనాలు నిర్మించాలి. ఇవాళ రాష్ట్రంలో
నూతన కలెక్టర్ ఆఫీసులు, పోలీసు కార్యాలయాలతో పాటు పేద,మధ్యతరగతి విద్యార్థుల చదువులపై కూడా దృష్టి పెట్టాలంటే బడ్జెట్ అధికం గా కేటాయించాల్సి న
బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై వుందన్నారు. రాష్ట్రంలో నిత్యం సంక్షేమ రంగం లో ముందు బాటలో నడుస్తున్నామని చేప్పుకునే రాష్ట్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్విద్యార్థిని, విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని తాళ్ల నాగరాజు కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒకసారి తాగే వాటర్ బాటిల్ ఖరీదు కాదు మా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఒకరోజు తినే భోజనం ఖరీదని తమ ఆవేదన వ్యక్తపరిచారు.తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులకు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు.
అందుకే జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30నుంచి ఫిబ్రవరి 5వరకు అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.అయినా బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం పై బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ నాయక్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, మాజీ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి కోర్ర సైదా, కొరె రమేష్, రేణుక, బుడిగ వేంకటేష్, రమేష్, లక్ష్మణ్, జగన్,వీరన్న,ఉపేందర్, సూర్య రమేష్ విద్యార్థినీ విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.





