*ప్రిన్సిపాల్ పై పిడి యాక్ట్ నమోదు చేయాలి..
జనసముద్రం న్యూస్:(జనవరి 28)
హుజురాబాద్ టౌన్
హుజురాబాద్ పట్టణం తుమ్మనపల్లి గ్రామంలోని ఏకాశీల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ని చితకబాదిన ఉపాధ్యాయుడు పై క్రిమనల్ కేసులు బుక్ చేయాలనీ పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ..పాఠశాల గుర్తింపు ను రద్దు చేయాలి అని అన్నారు. విచక్షణ రహితంగా కోట్టిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోని పిడి యాక్ట్ నమోదు చేయాలని గాయపడిన విద్యార్థులకు మేరుగైన వైద్యం అందించాలని విద్యార్థుల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శి అంగిడి కుమార్, కుతాటి రాణప్రతాప్,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్,జిల్లా సహాయ కార్యదర్శి కేషబోయిన రాము,ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్,శ్రీకాంత్,రాజు తదితరులు పాల్గొన్నారు.