
జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 24
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం స్నూకర్ వరల్డ్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు ప్రజా ప్రతినిధులతో ఆటలు ఆడారు. ప్రస్తుత మానసిక ఒత్తిడి జీవితంలో ఆటలు ఆడి ప్రశాంతత పొందాలని తెలిపారు. అనంతరం స్నూకర్ నిర్వాహకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ కుమ్మరి యాదగిరి, రాందాస్, నరేష్ లు పోచారం భాస్కర్ రెడ్డిని, నాయకులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాన్సువాడ, పిట్లం మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.





