జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 20.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని సమితి సింగారం ఏరియా నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో సుమారు 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి అదే విధంగా రేగా చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారని వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ రేగా కాంతారావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో పురోగతిని ఇస్తున్నదని, తెలంగాణ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ గూటికి చేరుతున్నారని తెలిపారు.అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రాజకీయాలకతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసరా పెన్షన్, రైతులకు కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్ ,పేదల కోసం కల్యాణ లక్ష్మి, ముబారక్ వాటి అనేక పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు.