జనసముద్రం న్యూస్,జనవరి 08:
అంతా అనుకున్నదే అవుతోంది. ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే ఎన్నికలలో కలసిపోవాలని కలసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అని ప్రచారం ఇప్పటిదాకా జరిగింది. అయితే ఇపుడు అది నిజం కాబోతోంది అని అంటున్నారు. అందుకే ఒక ఫైన్ సన్ డే సడెన్ గా హైదరాబాద్ లోకి పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి తెలుగుదేశం అధినేత ఇంటికి కారు బయల్దేరి వెళ్ళింది.
ఇది విజయవాడ నోవెటెల్ హొటెల్ లో పవన్ని బాబు కలసి భేటీకి కంటిన్యూయేషన్ అన్న మాట. అంటే మరింతగా తెరలు తొలగిపోతున్న నేపధ్యం. వాస్తవిక రూపంగా బాబు పవన్ దోస్తీ మారుతున్న సందర్భం. ఇన్నాళ్ళూ ప్రచారంగా ఉన్న విషయం ఇపుడు ఆచరణలోకి వస్తున్న పరిణామం. నిజానికి ఇది ఆశ్చర్యకరమైన భేటీ కాకపోయినప్పటికీ సండే కావడం ఏపీ రాజకీయాలలో ఇది ప్రభావం చూపే అంశం కావడంతో టోటల్ మీడియా అటెన్షన్ ఈ వైపుగా మళ్ళింది.అసలు ఏమి జరిగింది. ఈ భేటీలో పవన్ చంద్రబాబు ఏమి మాట్లాడుకుని ఉంటారు అని రకరకాలైన ప్రచారం మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఒక్కటి క్లిస్టర్ అండ్ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో బాబు పవన్ పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్ళడం కచ్చితం. దానికి ప్రాతిపదిక ఏనాడో పడిపోయింది.
ఇపుడు జరుగుతున్న భేటీలు అన్నీ కూడా రేపటి ఎన్నికల కోసమే అంటున్నారు. ఆ విధంగా ఆలోచన చేస్తే కనుక ఈ తాజా భేటీలో జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల విషయంలో సీరియస్ గానే చర్చ సాగింది అని అంటున్నారు. నిజానికి పొత్తులు ఏనాడో కుదిరాయి. సీట్ల వద్దనే పంచాయతీ తేలడంలేదు. అయిఏ జనసేన యాభై సీట్లకు పట్టుపడుతోంది. అంటే మొత్తం 175 సీట్లలో 35 శాతం అనన్ మాట. ఆ విధంగా కనుక తమకు సీట్లు ఇస్తే అందులో కనీసం ఒక ముప్పయి దాకా గెలిస్తే రేపటి ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వంలో తమ ప్రభావం గట్టిగా ఉంటుందని పవన్ ఆలోచన అని చెబుతున్నారు.
అయితే మొత్తం 175 సీట్లలో జనసేనకు 50 సీట్లు ఇవ్వడం అంటే అసలు కుదిరే వ్యవహారం కాదు. ఎందుచేత అంటే ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఇప్పటిదాకా ఉమ్మడి ఏపీలోనే పాతిక సీట్లను మించి మిత్రులకు పంచలేదు. అలాంటిది ఏపీలో ఉన్న సీట్లలో ఆ నంబర్ ఇస్తే తమ్ముళ్లకు అన్యాయం జరగడమే కాకుండా తెలుగుదేశం పార్టీలోనే అది తిరుగుబాటుకు దారితీస్తుందని ఒక ఆలోచన తెలుగుదేశానికి ఉంది.అదే విధంగా జనసేనకు అన్ని సీట్లు ఇస్తే గెలుస్తుందా లేక అవి వైసీపీ పరం అవుతాయా అన్న బెంగ కూడా ఉంది. అందుకే సీట్ల విషయంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. దాంతో ఇపుడు ఆ విషయం తేల్చుకునేందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లారు అని అంటున్నారు. మరి తెలుగుదేశం మనసులో అయితే 15 నుంచి మొదలెట్టి 20 దాకా రెట్టించి పాతికకు తెగ్గొడదామని ఉంది అని అంటున్నారు.
ఇపుడు పవన్ కళ్యాణ్ యాభై అనడంతో తెలుగుదేశం కూడా కాస్తా పట్టూ విడుపూ ప్రదర్శించి దాన్ని కాస్తా మరింతగా పెంచింది అని అంటున్నారు. అంటే 32 సీట్ల దాకా జనసేనకు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించనుంది అంటున్నారు. ఇదే ఈ ఇద్దరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అంటే రెండు పార్టీల పొత్తుకు ఎంతో కొంత ఇబ్బందిగా ఉన్న సీట్ల పంచాయతీ అయితే తెగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.