

వనపర్తి జిల్లా ,చిన్నంబావి మండలం ,జనసముద్రం ప్రతినిధి శ్యాం ,జనవరి 7
చిన్నంబావి మండల పరిధిలో కొత్త మాధవరావు ట్రస్ట్ సేవే పరమావధిగా పనిచేస్తూ … నిరుపేదలకు అప్పన్న హస్తం అందించడానికి ఎల్లవేళలా ముందుంటుందని కెఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కొత్త కళ్యాణ్రావు అన్నారు.
శనివారం చిన్నంబావి మండల ఎస్సై వస్త్రం నాయక్ చేతుల మీదుగా కేఎంఆర్ ట్రస్ట్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాలంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం చేపట్టమని, నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తూ విద్యాపరంగా ఆదుకుంటున్నామని, వికలాంగులకు త్రీ వీలర్ స్కూటీలను అందించి వారికి తోడ్పాటు అందించామని, 2023 నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. తాను చదువుకునే రోజు ల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్ననని, ప్రస్తుతం డిజిటల్ యుగంలో విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను అందించడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత సంవత్సరకాలంగా వెల్టూరు ప్రభుత్వ పాఠశాలలో నలుగురు విద్యా వాలంటరీలను నియమించి విజయనందిస్తున్నారని, వెల్టూరు గ్రామంలో జమ్మలమ్మ గుడి అభివృద్ధికి కోటిన్నర రూపాయలు వేచిచి అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. వెల్టూరు గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు పూర్తి సహకారం అందిస్తానని స్థానిక ఎస్సైకి తెలియజేశారు. అలాగే గుడి మరియు బడి కాన్సెప్ట్ తో తన కెఎంఆర్ ట్రస్ట్ ముందుకెళ్తుందని అందులో భాగంగానే మండల పరిధిలోని సుమారు 10 గ్రామాలలో ఆయా దేవాలయాలకు ఆధునిక మెరుగురు దిద్దడానికి, నూతన నిర్మాణాలకు ట్రస్టు ఆధ్వర్యంలో చేయూతను అందించడం ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆకుల వెంకటేష్, నాగశేశి, ధర్మేందర్, ఎస్సై వస్త్రం నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.