

సీనియర్ పోలీసు అధికారి కె. నారాయణ్ నాయక్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గా బాధ్యతలు స్వీకరించారు 2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నారాయణ్ నాయక్ గతంలో సీఐడీలో పనిచేశారు గతంలో ఉట్నూర్, ఆదిలాబాద్, జగిత్యాల, దేవరకొండ, వరంగల్, గ్రేహౌండ్స్‌లో పనిచేశారు సైబరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అయన మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సహకారం తో సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తనవంతు కృషి చేస్తానని నాయక్ తెలిపారు
ఆర్ అండ్ బి, హెచ్ఎండిఏ
యొక్క ప్రభుత్వ ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో మరియు ప్రజలతో కూడిన ఓట్జర్ వాటాదారుల సమన్వయంతో, మరణాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని గచ్చిబౌలి సైబరాబాద్‌కు కేంద్రంగా ఉండడంతో రోడ్డు ట్రాఫిక్‌ను అంతర్లీనంగా మరియు బయటికి వచ్చే ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని, నా విధులు బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టడానికి నేను ఉత్తమమమైన సేవ అందించడానికి ప్రయత్నిస్తాను” అని ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్ తెలిపారు