
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో గడ్డం స్వప్న(25) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తరుపున రూ.10,000 రూపాయలను ఆమె కుటుంబసభ్యులకు వితరణగా అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, ఎంపీటీసీ కాయం శేఖర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు యాదగిరి చెన్నకేశవులు, అబ్బరబోయిన అయిలయ్య, కల్తి కృష్ణ, పాయం నరేష్, కొమరం నగేష్, పాయం శ్రీరాములు, ఎంపీటీసీ హరీష్, పూనెం సాంబశివరావు, కొమరం సందీప్ తదితరులు పాల్గొన్నారు.





