ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని..అవసరమైతే హైకోర్టుకు..సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదల

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 4:

బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది.

ఇటీవలే సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దీనిపై అప్పీల్ కు వెళ్లాలని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీంతో కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.ఇటీవల హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్  సర్కార్ కు షాకిచ్చింది. నలుగురు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును తెలంగాణ హైకోర్టు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించడంతో కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బట్టబయలు చేయడంలో అత్యుత్సాహం కారణంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కులు తప్పవని ప్రముఖ బ్యూరోక్రాట్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలు ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇతర పత్రాలతో సహా దర్యాప్తు అంశాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయనే కీలకమైన అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి బీ విజయసేన్ రెడ్డి తన తీర్పులో లేవనెత్తారు. ముఖ్యమంత్రికి ఎవరు ఆధారాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమాధానం చెప్పలేకపోయారని న్యాయమూర్తి గమనించారు. ఇక సిట్ దర్యాప్తు సరిగాలేదని..పేర్కొన్న హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి 45 కారణాలను చూపించింది.

అయితే బీజేపీ విషయంలో ఎక్కడ తగ్గకూడదని.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని.. అందుకే అవసరమైతే హైకోర్టుకు.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదలతో ఉంది.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్