ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 2:

ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు మాత్రం అది మసకబారుతోంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడమే. అదే టైం లో న్యాయ సమీక్షలో మూడు రాజధానులు తేలిపోయింది. అమరావతి ఏకైక రాజధాని అంటూ హై కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది.

ఇక సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈ లోగా ఉండబట్టలేక మంత్రులు సీనియర్ నేతలు తలో రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అవి చివరికి పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో ఉప ప్రాంతీయ విభేదాలకు కారణం అవుతున్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే విశాఖ రాజధాని కనుక ప్రకటించకపోతే ఉత్తరాంధ్రాను చిన్న రాష్ట్రంగా చేసుకుంటామని కాస్తా బెదిరించే ధోరణిలో మాట్లాడారు.ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ లో అమరావతే మన ఏకైక రాజధాని అంటూ ఇచ్చిన ప్రకటన మీద కౌంటర్ చేశారు. కానీ ఆయన ఇచ్చిన కౌంటర్ నేరుగా వైసీపీకే తగిలి బూమరాంగ్ అయింది. ఏపీలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. పైగా విశాఖ రాజధాని అని చెబుతూ వస్తఒంది వైసీపీ పెద్దలు. మూడున్నరేళ్ళు పై దాటిన అది సాకారం కాకపోవడానికి వైసీపీ పెద్దలదే బాధ్యత. మరి అలాంటి విషయంలో విపక్ష నేతగా చంద్రబాబు ఏం చేస్తారు

వైసీపీకి చేతనైతే మూడు రాజధానులను ఏర్పాటు చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అదే విధంగా సీనియర్ మంత్రిగా ప్రభుత్వంలో తానూ భాగంగా ఉంటున్న ధర్మన ప్రసాదరావు ఎవరిని బెదిరిస్తారు అని విపక్షాల నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. మాకు చిన్న రాష్ట్రం ఇచ్చేయండి అని ఆయన ఎవరిని అడుగుతున్నారు అని కూడా ఇక్కడ చర్చకు వచ్చే మాట. చంద్రబాబుకు అధికారం లేదు. వైసీపీయే రాజధాని అయినా రాష్ట్రం అయినా ఇవ్వాలి. మరి తాను ప్రభుత్వంలో భాగంగా ఉంటూ తమ ప్రభుత్వం మీద తానే ఫైర్ అవుతున్నారా  అన్న ప్రశ్నలు తలెత్తేలా మంత్రి గారి కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

ఇక విశాఖ రాజధాని విషయంలో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో ఉప సంహరించుకున్నది వైసీపీ ప్రభుత్వం. ఆ విషయంలో విపక్షాలకు ఏమీ సంబంధం లేదు. అలాగే కోర్టు తీర్పు కూడా  దీని మీద వచ్చింది. తమ మూడు రాజధానుల వాదనలు సమర్ధంగా టెక్నికల్ గా చాలా అంశాలు ప్రభుత్వం జవాబు చెప్పుకోలేకపోవడం వల్ల ఇబ్బందిగా మారాయని అంటున్నారు.ఇంత జరిగినా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అమరావతి మీద కేసు వేసింది. దాని మీద విచారణ సాగుతోంది. తీర్పు కూడా వచ్చే వరకూ వేచి ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందులో మంత్రులుగా ఉన్న వారిదే. మరి ధర్మాన ఇవన్నీ తెలిసి కూడా ఉత్తరాంధ్రా  రాష్ట్రమని  ఎలా జనాలను రెచ్చగొడతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం మూడు నెలలలో విశాఖ రాజధాని అంటున్నారు. తప్పకుండా వస్తుంది అంటున్నారు. ఒకే ప్రభుత్వం ఇద్దరు మంత్రులు భిన్న వాదనలు విభిన్నమైన ఆశలు ధీమాలు. ఇదెలా సాధ్యం అన్నదే చర్చగా ముందుకు వస్తోంది. బొత్స సత్యనారాయణకు విశాఖ రాజధాని మూడు నెలలలో అవుతుంది అన్న నమ్మకం ఉంది. అదే ధర్మానకు లేదు. ఇదేలా అంటే ఒకే ప్రభుత్వంలో ఇంతటి గందరగోళం ఏంటి అని కూడా సెటైర్లు పడుతున్నాయి.

ఒక ఒకరు విశాఖ రాజధాని అంటూంటే మరొకరు ఉత్తరాంధ్రా  రాష్ట్రమని  అంటున్నారు. ఇలా భిన్న రీతుల తాము స్పందిస్తూ సరైన  స్పష్టత  లేకుండా చేస్తూ ప్రజలకు కూడా గందరగోళంలోకి నెడుతున్నారు అన్నదైతే ఉంది. అలాగే వైసీపీ శ్రేణులను కూడా గందరగోళంలోకి నెడుతున్నారు అని అంటున్నారు. నిజానికి ఒక రాజధాని అయినా లేక రాష్ట్రం అయినా సున్నితమైన అంశాలు. కానీ వాటిని ఆ వెనక సెంటిమెంట్ ని కూడా బాధ్యత గల మంత్రులు లైట్ తీసుకుంటూ తడవకో స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఇలా బిగ్ కంఫ్యూజ్ చేయడం న్యాయమా అన్న చర్చ ముందుకు వస్తోంది. ఇలా మాట్లాడుతున్న సీనియర్ మంత్రులకు అయినా తాము చెప్పే విషయంలో క్లారిటీ ఉందా లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Related Posts

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు