జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి, డిసెంబర్ 24:
నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేసారు నలుగురు నిందితులతో కూడిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి బీహార్ మరియు ఒర్రిసా రాష్ట్రానికి చెందిన శాంతన్ కుమార్, సితాంబర్ నాయక్ లు పలు బార్ లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈజీ మనీ కోసం నిందితులు నకిలీ మద్యం విక్రయాన్ని ఎంచుకున్నారు పలు వేడుకలలో త్రాగి పడేసిన కాళీ విదేశీ మద్యం సీసాలు సేకరించి అందులో చౌకైన స్వదేశీ మద్యం ఇంపీరియల్ బ్లూ సేకరించిన కాళీ గ్లెన్‌ఫెడిచ్ సీసాలో నింపి ఒక్కక్కటి మూడు వేలకు అమ్ముతున్నారు దీనితో పక్క సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి లోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీసులు మాదాపూర్ లోని కావూరి హిల్స్ దగ్గర సంతోష్ కుమార్, జ్ఞాన రంజన్ నాయక్ ల కు 16 నకిలీ విదేశీ గ్లెన్‌ఫెడిచ్ మద్యం బాటిల్ లు అమ్ముతుండగా స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి నకిలీ మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు ఇంకా వీరి నుండి 24 కాళీ విదేశి మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కాగా తక్కువ ధరకు విదేశీ మద్యం విక్రయిస్తున్న ముఠాల నుండి వినియోగదారులు మద్యం కొనరాదని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు ఈ దాడిలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, కృష్ణ కాంత్, సంధ్య కానిస్టేబుళ్లు అరుణ్ కుమార్, యాదగిరి పాల్గొన్నారు