నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి, డిసెంబర్ 24:

నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును స్టేట్ ఎక్సైజ్‌ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేసారు నలుగురు నిందితులతో కూడిన ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి బీహార్ మరియు ఒర్రిసా రాష్ట్రానికి చెందిన శాంతన్ కుమార్, సితాంబర్ నాయక్ లు పలు బార్ లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈజీ మనీ కోసం నిందితులు నకిలీ మద్యం విక్రయాన్ని ఎంచుకున్నారు పలు వేడుకలలో త్రాగి పడేసిన కాళీ విదేశీ మద్యం సీసాలు సేకరించి అందులో చౌకైన స్వదేశీ మద్యం ఇంపీరియల్ బ్లూ సేకరించిన కాళీ గ్లెన్‌ఫెడిచ్‌ సీసాలో నింపి ఒక్కక్కటి మూడు వేలకు అమ్ముతున్నారు దీనితో పక్క సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి లోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్‌ పోలీసులు మాదాపూర్ లోని కావూరి హిల్స్ దగ్గర సంతోష్ కుమార్, జ్ఞాన రంజన్ నాయక్ ల కు 16 నకిలీ విదేశీ గ్లెన్‌ఫెడిచ్‌ మద్యం బాటిల్ లు అమ్ముతుండగా స్టేట్ ఎక్సైజ్‌ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి నకిలీ మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు ఇంకా వీరి నుండి 24 కాళీ విదేశి మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కాగా తక్కువ ధరకు విదేశీ మద్యం విక్రయిస్తున్న ముఠాల నుండి వినియోగదారులు మద్యం కొనరాదని ఎక్సైజ్‌ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు ఈ దాడిలో స్టేట్ ఎక్సైజ్‌ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, కృష్ణ కాంత్, సంధ్య కానిస్టేబుళ్లు అరుణ్ కుమార్, యాదగిరి పాల్గొన్నారు

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!