ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రతి రోజూ.. ఉదయం సాయంత్రం..ఇంటింటికీ వైసీపీ గృహ సారథులు

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16:

ఏపీ ప్రజలకు ఇక మైండ్ వాష్ ఖాయం. ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు. ముఖ్యంగా ఎన్నారై లు అయితే..మరింత ఆసక్తిగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తనుంది.

మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వమే ముందుగా ఈ ప్రచార వ్యూహంలోకి పదునుగా అడుగులు వేసింది. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం ఉద్దేశం ఎన్నికల ప్రచారం.
మరోవైపు వలంటీర్ వ్యవస్థ కూడా ఎంత కాదన్నా.. ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకుంది. ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నా.. బియ్యం ఇస్తున్నా.. వలంటీర్లు గత మూడు మాసాల నుంచి కూడా జగన్ పేరును ప్రస్తావించకుండా.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రస్తావించకుండా మాత్రం ఇవ్వడం లేదు. అంటే. ఒకరకంగా.. ఇది ప్రచారమే. ఇక దీని సంగతి ఎలా ఉన్నప్పటికీ.. త్వరలోనే గృహ సారథులు వస్తున్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రతి రోజూ.. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా.. తిరుగుతారు. వారి కాన్సెప్ట్ ఏంటంటే.. ప్రజలను వైసీపీవైపు మళ్లించి.. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే.
ఇది వైసీపీ కి మేలు చేసే కార్యక్రమం అయితే.. మరోవైపు.. ప్రజల  బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమమని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఇంటా బయటా.. నాయకులు చేస్తున్న ప్రచారం తెలిసిందే.
దీనికితోడు మీడియా ముందు విమర్శలు వంటివి వినలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం.  ఇక ఇప్పుడు.. 50 ఇళ్లకు ఇద్దరిని పెట్టి.. ప్రతి ఇంటికీ పంపించి.. ప్రభుత్వ సంక్షేమంపై వివరించడం.. వారిని వైసీపీకి ఓటేసేలా తీర్చదిద్దడం  అంటే.. ఖచ్చితంగా  ప్రజలకు బ్రెయిన్ వాచిపోయేలా.. వారికి  చెప్పిందే చెబుతారనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం మంచిదే అయినా.. ఇలా.. టికెట్ కోసం.. స్టేషన్లో టీసీ నిలబెట్టినట్టు ప్రజలను నిలబెట్టి వాయించేయడం.. నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్