900 వందల వైన్ బాటిల్ ఆర్డర్ చేయబోయి లక్ష పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగిని..!

Spread the love

జనసముద్రం న్యూస్ ,డిసెంబర్16,

లక్షల్లో జీతం.. ఐదు రోజులే పని. చేతినిండా పైసలుంటే ఎవరికి మాత్రం ఎంజాయ్ చేయ బుద్ధి కాదు చెప్పండి. ఇక సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పని చేసే వారైతే వీకెండ్ కోసం చకోర పక్షుల్లా వెయిట్ చేస్తూ ఉంటారు. వీకెండ్ వస్తే చాలు క్లబ్బులు.. పబ్బులు.. దావత్ లంటూ నానా హంగామా చేస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే.
అసలే ఇయర్ ఎండింగ్.. దీనికి తోడు క్రిస్మస్ పార్టీల హంగామా నగరాల్లో అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ టెక్కీ తన వీకెండ్ ను అదిరిపోయేలా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది. ఆన్ లైన్ మంచి కిక్కు ఇచ్చే మందు బాటిల్ కోసం వెతికింది. ఈక్రమంలోనే ఒక కంపెనీకి చెందిన బ్రాండ్ మందు ఆమె కంటపడింది.
దానిని ఆన్ లైన్ లో బుక్ చేసేందుకు ప్రయత్నించగా పేమెంట్ కాలేదు. దీంతో సదరు కంపెనీ కస్టమర్ కేర్ ఫోన్ చేసి సమస్యను వివరించింది. అయితే కస్టమర్ బ్యాంక్ డిటైల్స్ అడగగా ఆమె నిరాకరించింది. అయితే అతడే ఫోన్ చేసి క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పగా అతడు చెప్పినట్లు చేసింది. రూ.900 వైన్ బాటిల్ కు ఏకంగా 96 వేల 902 రూపాయలు కట్ అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది.
దీంతో కంగుతిన్న ఆమె షాక్ నుంచి కోలుకోని పూణే పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువతి పూణేలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కలిసి రావడంతో ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని టెక్కీలు డిసైడయ్యారు.
ఈ క్రమంలోనే ఆన్ లైన్ ఓ మంచి బ్రాండ్ కోసం ఆ మహిళా టెక్కీ వెతికింది. ఆమె చూసిన బ్రాండ్ కొనేందుకు ప్రయత్నించగా ఆర్డర్ కాకపోవడంతో కస్టమర్ కేర్ తో మాట్లాడింది. అయితే అవతలి నుంచి మాట్లాడిన వ్యక్తి ఆ లేడీ టెక్కీకి మస్కా కొట్టాడు. మొదట బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడుగగా ఆమె నిరాకరించింది.
క్యూర్ కోడ్ స్కానింగ్ కోడ్ పంపాడు. దీనిని ఆమె స్కానింగ్ చేసిన మందు బాటిల్ ఆర్డర్ చేసింది. అయితే ఆ తర్వాత అతడే మళ్లీ క్యూర్ కోడ్  స్కాన్ వివరాలు కావాలని కోరగా ఆమె చెప్పింది. ఆ వెంటనే ఆమె అకౌంట్ నుంచి 96 వేల 902 రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె అవతలి వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
రూ.900ల వైన్ బాటిల్ ఆన్ లైన్ ఆర్డర్ చేస్తే ఏకంగా లక్ష రూపాయలు అకౌంట్ నుంచి మాయం కావడంతో ఆమెకు మందు కొట్టకుండానే పుల్ బాటిల్ కిక్కు ఎక్కినంత పనైంది. ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే పూణేలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి చీటింగ్ కేసు పెట్టింది. ఆ లేడి టెక్కీ చెప్పిన వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

  • Related Posts

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో…

    అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు

    Spread the love

    Spread the love ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు