
అనంతపురం జిల్లా, చిన్మయి నగర్, ప్రసన్నాయపల్లి,జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మండూస్ తుఫాను ప్రభావం బాగా కనిపిస్తుంది. విపరీతమైన చలిగాలులుతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇక ఉదయం 11 గంటల వరకు కూడా చాలా నగరాల్లో మంచు కురుస్తూనే ఉంటుంది. శీతాకాలం ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు : అనంతపురం జిల్లా , చిన్మయి నగర్ , ప్రసన్నాయపల్లి లో 14.5 డిగ్రీలు
ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నపరిస్థితి ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందని జనం భావిస్తున్నారు.
ఇక ఉదయాన్నే పొగమంచుతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా , చిన్మయి నగర్ , ప్రసన్నాయపల్లి లో గురువారం ఉదయం 14.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలిపులి దెబ్బకు వణికిపోతున్నారు.

చలి దెబ్బకు పెరుగుతున్న ఆస్తమా, సైనసైటిస్ బాధితులు:
అనంతపురం జిల్లా , చిన్మయి నగర్ , ప్రసన్నాయపల్లి లో 12డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రోజంతా చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఇక ప్రస్తుతం చలి దెబ్బకు చాలామంది ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతంగా చలి పెరిగిన కారణంగా ఉదయం, రాత్రి పూట బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని, ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.






