అప్పుల తిప్పలు.. ఆర్బీఐ వద్దన్నా 2300 కోట్లు కొత్త అప్పులు చేసిన ఏపి ప్రభుత్వం

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీవ్ర  ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల రెండు వారాలు గడిచిపోయినా ఇంతవరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లించలేదని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జీతాలు పింఛన్ల రూపంలో రూ.2500 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రధాన మీడియా పేర్కొంది.

ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వం మరో రూ.2300 కోట్లు అప్పు తెచ్చుకుందని ప్రధాన మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొత్తగా తెచ్చిన ఈ అప్పుల్లో దాదాపు రూ.2000 కోట్ల వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) కింద చెల్లించాల్సిన మొత్తమేనని మీడియా కథనాలు వివరిస్తున్నాయి.

డిసెంబర్ 17వ తేదీలోగా తమ ఓవర్ డ్రాప్టు (ఓడీ) అప్పు చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తామని ఆర్బీఐ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ సమయానికి ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం వేతనాలు కూడా చెల్లించలేదని సమాచారం. దీంతో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి తమ డిమాండ్లను సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.

దీంతో జగన్ ప్రభుత్వం తాజాగా మరో రెండు కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రూ.2300 కోట్ల అప్పు తెచ్చిందని ప్రధాన మీడియా చెబుతోంది. ఈ మేరకు డిసెంబర్ 13న యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2300 కోట్ల అప్పు జగన్ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఇందులో రూ.2వేల కోట్లను ఓడీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించిందని తెలుస్తోంది. మిగిలిన మొత్తంతో పెండింగ్లో ఉన్న జీతాలను కొంత మేరకు చెల్లించిందని అంటున్నారు. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలంటే మళ్లీ ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాప్టు (ఓడీ)కీ వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. మరోవైపు.. వేజ్ అండ్ మీన్స్ స్పెషల్ డ్రాయల్ లిమిట్స్ రూపంలో దాదాపు రూ.2500 కోట్లు ఇప్పటికీ ఆర్బీఐకి చెల్లించాల్సి ఉందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

కార్పొరేషన్లకు అప్పులివ్వకూడదని గతంలోనే బ్యాంకులకు ఆర్బీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ కార్పొరేషన్లకు అప్పులు  ఇవ్వాల్సి వస్తే వాటికి తిరిగి కట్టే స్తోమత ఉందో లేదో చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అలాగే ఆ అప్పును కార్పొరేషన్ల పనులు అభివృద్ధికే వెచ్చిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కూడా బ్యాంకులకు ఉంది అని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది.అయితే ఆర్బీఐ ఆదేశాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదని ప్రధాన మీడియా పేర్కొంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంకు జగన్ ప్రభుత్వానికి సొంత బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ రెండు బ్యాంకులే మళ్లీ రూ.2300 కోట్లు జగన్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడం గమనార్హం.

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు