జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13:
ప్రజా సమస్యలే తన ఊపిరిగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజంలో సమానత్వంగా జీవించాలని ఆలోచనతో తాను ఒక్కడిగా ప్రారంభమై నేటికీ సుమారు లక్షలాదిమంది ప్రజలను సభ్యులుగా చేర్చుకొని నేను కాదు మేము సైతం సమాజ సేవకులమే అనే నినాదంతో సంస్థలో ప్రతి ఒక్కరిని ఒకే తాటిపై నడిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నటువంటి మన గ్రా వ్యవస్థాపకులు మరియు జాతీయ చైర్మన్ కాసల కోనయ్య మంగళవారం మరో వ్యక్తికి పునర్జన్మ ఇచ్చారు .వివరాల్లోకి వెళితే కడపజిల్లా బద్వేలు డిపో కు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ రోజు 60 సంవత్సరాల వృద్దుడు గుండెపోటుతో సీటులోనే కుప్పకూలాడు..అదే బస్సులో ప్రయాణిస్తున్న GHRAA నేషనల్ చైర్మన్ కాసల కోనయ్య గారు వెంటనే CPR విధానం ద్వారా గుండెల మీద రెండు చేతులతో స్పీడ్ గా ప్రెస్ చేసి ప్రాణాలను కాపాడారు.వెంటనే దగ్గరలోని సిద్ధవటం ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేసి ప్రాణాన్ని కాపాడగలిగారు