సీఎం జగన్ పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన సామాన్యుడిని చితక బాదిన పోలీస్ కానిస్టేబుల్

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13:

ఒక సామాన్యుడు రోటీన్ కు భిన్నంగా ఒక సాహసం చేశాడు. సంచలనంగా మారేలా తన చేష్టతో తన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించాడో? లేదంటే ముఖ్యమంత్రి కంట్లో పడి.. సమస్య పరిష్కారం కావటమే కాదు.. సంబంధిత అధికారులకు షాకిస్తారని ఆశించినట్లున్నాడు. కానీ.. అతడి ప్రయత్నం బెడిసి కొట్టటమే కాదు.. తుక్కుగా దెబ్బలు తిని మరీ బయటకు రావాల్సి వచ్చిందంటూ భోరుమంటున్న వైనం ఏపీలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని తిరిపాలు అనే వ్యక్తి తమ సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తాము నివసించే వీరాయిపాలెం గ్రామంలో 500 మందికి పైనే ఉన్నా.. అందరికి కలిపి ఒకటే బోరు ఉండటంతో నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చాలామంది అధికారుల వద్దకు వెళ్లాడు.తన విన్నపాన్ని వారికి ఇచ్చాడు. అయినా.. అధికారులు స్పందించలేదు. దీంతో.. సమస్య పరిష్కారం కోసం తమ సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ మీద కేసు పెట్టాలని భావించాడు.

ఇందులో భాగంగా  యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఎస్ఐ లేకపోవటంతో తాను స్టేషన్ కు వచ్చిన కారణాన్ని వెల్లడించాడు. అతడి మాటలు విన్నంతనే అక్కడి కానిస్టేబుల్ కు మంట మండింది. ముఖ్యమంత్రిపైనే కేసు పెట్టేందుకు వచ్చావా? అంటూ బెల్టుతో చితకబాదాడు.దీంతో గాయాలపాలైన అతడు మీడియాతో మాట్లాడాడు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ఓటు వేశానని.. మరి తమ సమస్యల్ని జగన్ కాక మరెవరు తీరుస్తారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై కేసు పెట్టేందుకు స్టేషన్ కు వస్తావా? అంటూ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఈ పోలీస్ స్టేషన్ మంత్రి అదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    One thought on “సీఎం జగన్ పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన సామాన్యుడిని చితక బాదిన పోలీస్ కానిస్టేబుల్

    1. సీఎం స్థాయిలో ఉన్నత వ్యక్తిపై కంప్లీట్ అన్నది ఒక ధైర్య సాహసంతో కూడిన కఠిన నిర్ణయం కానీ ఆ నిర్ణయానికి హ్యాట్సాఫ్
      భారత రాజ్యాంగం ప్రకారం సర్పంచ్ స్థాయి నుంచి పీఎం స్థాయి వరకు ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వడానికి రోలు ఉంది కానీ ఈ పోలీసు ఆ రూమ్ ని అతిక్రమించి కాకుండా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఒక సామాన్య వ్యక్తిని ఇలా చితకబాది కొట్టడం పెద్ద నేరం ఇలాంటి వాటిపై హిమన్ రైట్స్ కలగజేసుకొని వాళ్లకు తగిన న్యాయం చేయాలని పక్షాన హ్యూమన్ రైట్స్ ఒక పనికిరానా సమస్తగా మిగిలిపోతుందని ఎందుకంటే మానవ హక్కుల కోసం ఒక సమస్యను ఏర్పరిచి దాని ద్వారా ఈ రాజకీయాలు ద్వారా అధికారం ద్వారా ప్రజలకు న్యాయం జరగదని ఇలాంటి ఒక సంస్థను అప్పట్లో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని కూడా హ్యూమన్ రైట్స్ వారు కేసును టేకప్ చేసి ఆ సామాన్యుడికి న్యాయం జరిగేలా చూడాలని అలాగే సామాన్య చేసుకున్న ఆ కానిస్టేబుల్ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!