

నస్రుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో డంపింగులు..టిప్పర్లు లారీల ద్వారా దూర ప్రాంతాలకు వెళుతున్న ఇసుక….
జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి,డిసెంబర్ 12::
సామాన్య మానవునికి ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే సవాలక్ష కారణాలు, తదితర ఆంక్షలు విధించే సంబంధిత అధికారులు ఏకంగా మండల కేంద్ర సమీపంలో గత కొన్ని నెలలుగా దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక డంపింగ్లు చేస్తూ పదుల నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్న పట్టించుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని నసుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో ఒక క్రషర్ వద్ద ఈ దందా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంబంధిత అధికారులకు తెలియడం అని పలువురు మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి కనిపించే డంపులు సంబంధిత అధికారులకు కనిపించకపోవడం పట్ల అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు, దీని వెనుక అసలు వాస్తవాలు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా ట్రాక్టర్లో తీసుకుని వచ్చి జెసిబి లు తదితర వాటి సాయంతో లారీలు టిప్పర్లలో తరలిస్తూ దర్జాగా ఇసుక అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకోవడం పోవడం వెనుక అసలు మతలబు ఏంటని, భూగర్భ జలాలను కొల్లగొడుతూ గత కొన్ని నెలలుగా ఈ దందా కొనసాగిస్తున్న చర్యలు తీసుకోకపోవడం గమనారం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ దందా చేస్తున్న వాటిపై నిఘా పెంచి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరొక్కరు అక్రమ ఇసుక దందా కొనసాగకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కొరడా జరిపించాలని స్థానికులు, మండల ప్రజలు కోరుతున్నారు.

