
జనసముద్రం ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, నవంబర్ 8.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వివిధ గ్రామాలలోని పర్యటన సందర్భంగా మార్గం మధ్యలో ఉన్న ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రము ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమoలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు వ్యవస్థ ఆధునీకరణ పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను సర్వహంగులతో నిర్మించుకుంటున్నామన్నారు. అదేవిధంగా నూతనంగా పోలీస్ స్టేషన్ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలు, తదితర అంశాలు చర్చించడం జరిగింది.





