జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 :
తమతో పాటు మరో ఇద్దరిని ఖాతాదారులుగా చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా వేలాది మందిని చేర్చుకుంది ఆ సంస్థ. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్ లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి సంస్థ నిర్వహాకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరారు.రూ.10వేలు కడితే 300 రోజుల్లో రూ.30వేలు ఇస్తామని మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఎర వేసింది. లక్ష రూపాయలు చెల్లిస్తే 300 రోజుల్లో 3లక్షల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో సంస్థ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ సొమ్మును సంస్థ నిర్వాహాకులు రియల్ ఎస్టేట్, మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు.