గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేలా కెసిఆర్ సంచలన నిర్ణయం

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ నేరుగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అలానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ లొల్లి తారాస్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై పలుమార్లు కేంద్రం పెద్దలను సైతం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాల క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలోనే గవర్నర్ ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు సమాచారం.  
ఈ మేరకు త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబర్ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వ తీరుతో పాటు గవర్నర్ వ్యవహారశైలిపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ సమావేశాల్లోనే గవర్నర్ ను వైస్ ఛాన్స్ లర్ పదవి నుంచి తప్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెడితేనే ఆ బిల్లు  అమల్లోకి వస్తుంది. తనకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు.  కాకపోతే గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బిల్లు తేవాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది.
ఇప్పటికే బీజేపీ గవర్నర్ల వ్యవహారశైలితో కేరళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా గవర్నర్లను విశ్వవిద్యాలయ చాన్సలర్ల పదవుల నుంచి గవర్నర్లను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లులను తెచ్చాయి. కానీ అవి ఇప్పటివరకూ ఆమోదం పొందలేదు.
ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా బిల్లు తెచ్చే యోచనలో కనిపిస్తోంది. మరి దీనిపై ఎలాంటి వివాదం చెలరేగుతుందో చూడాలి.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి