జనసముద్రం న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01
హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం సమర్పించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్దులు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

- 2022-23 అకాడమిక్ విద్య సంవత్సరం పూర్తి కావడానికి మూడు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ కనీసం ఇప్పటి వరకు విద్యార్దులకు యూనిఫాం ఇవ్వలేదని, వెంటనే విద్యార్దులకు యూనిఫాంను అందజేయాలి.
- వందలాది మంది విద్యార్ధులు ఉండే ఆశ్రమ పాఠశాలలు ఎక్కడ ఎక్కడో అడవులల్లో ఉండటంతో విద్యార్ధులు అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స చేయడానికి ఏఎన్ఎంలు లేక త్రీవ ఇబ్బందికి గురవుతున్నారు.వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలి.
- కొన్ని పాఠశాలల్లో తరగతి గదులనే డార్మేటరిలుగా ఉపయో గిస్తున్నందున పిల్లలు చాల ఇబ్బందులు పడుచున్నారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.
4.ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు అనారోగ్యంతో ఏదైనా పెద్ద సమస్యకు గురైతే దూర ప్రాంతంలో ఉండే హాస్పిటల్ కు వెళ్ళడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చెయ్యాలి. - ఆశ్రమ పాఠశాలల పాత బిల్డింగులు శిథిలావస్థలో ఉన్న స్థానములో నూతన బిల్డింగులు మంజూరు చేయాలి.
- ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ సమస్యలు పునరుద్దరించాలి.
- విద్యార్దుల తాగు నీటి సమస్యను పరిష్కరించాలి.
8.తరగతి గదులకు టాయిలెట్లకు సరైన తలుపులు లేకపోవటంతో విద్యార్దులు చాలా ఇబ్బందులు పడుచున్నారు. - ప్రస్తుత కంప్యూటర్ యుగంలో విద్యార్ధులు ప్రపంచ జ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్ ఆపరేటరుని నియమించి, పిల్లలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలి. ప్రొజెక్టర్ ఉన్నప్పటికీ దానిని మెయింటెనెన్స్ చేయకపోవటం వలన పని చేయటం లేదు.వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.
- పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో ఆహరం తీసుకునేందుకు డైనింగ్ హాలులో ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి.
- ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పిఇటి. టీచర్లు,భోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి.
- ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల మనోవికాసానికి దోహదం చేసే ఆట వస్తువులు, ఆట స్థలం లో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
- క్యాజువల్, డైలీ వెజ్ లేబర్లు గత 30 రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం విధులు బహిష్క రించి దీక్ష చేస్తున్నారు, ఈ కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుచున్నారు. కాబట్టి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీతక్క తన లేఖలో పేర్కొన్నారు.