హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభంకానున్నాయి. మైండ్ స్సేస్ జంక్షన్ నుంచి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను పొడగించనున్నారు. 31 కిలో మీటర్ల మేరకు ఉన్న ఈ నిర్మాణానికి, రూ. 6,250 కోట్లతో పనులను చేపట్టనున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ పనులను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.








