మనీ పాలిటిక్స్ : ఒక్కో ఎమ్మెల్యే ఖరీదు తెలంగాణ లో 100 కోట్లు..రాజస్థాన్ లో 10 కొట్లేనా..!!

Spread the love

తెలంగాణకు రాజస్థాన్ కు శాన్ ధార్ ఫరక్ (తేడా) ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్న బీజేపీ ఏజెంట్లు.. అదే రాజస్థాన్ లో కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పుతామన్నారు. ఇది మనం అంటున్న విషయం కాదు.. స్వయంగా రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ తాజాగా అన్న మాటలు ఇవీ

2020లో తన ప్రభుత్వాన్ని కూల్చడానికి  సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసినప్పుడు  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్యాంపుకు వెళ్లి మరీ బేరాలు జరిపారని.. ఒక్కో ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చారని ఆధారాలు ఉన్నాయని గెహ్లాట్ తెలిపారు.  అలాంటి తిరుగుబాటు ద్రోషిని సీఎం చేస్తే పార్టీ నాశనం అవుతుందనేది ఆయన మాట.. నిజానికి ఆయన సచిన్ ను విమర్శిస్తున్నట్టుగా కాదు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరిస్తున్నట్టుగానే ఈ మాటలు ఉన్నట్టు అర్థమవుతోంది.రెండేళ్ల క్రితం సచిన్ పైలట్ ఆయనకు విధేయులైన 18మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన లేదని వివరణ ఇచ్చారు.గతంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేలా ప్రయత్నించారు. సచిన్ పైలెట్ ను రప్పించి మెప్పించి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీనే అన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది.  రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా ఉండేటట్టు కాపాడింది ప్రియాంకగాంధీనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.సచిన్ పైలట్ కు ప్రస్తుతం పాత పదవులు ఇచ్చేటట్టు అతడి మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటట్టు ప్రియాంక గాంధీ ఒప్పించినట్టు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికల క్యాంపెయిన్ అంతా సచిన్ పైలెట్ కు అప్పజెప్పి గెలిస్తే సీఎంను చేస్తాము అని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుందని.. ‘నీవు నా తమ్ముడితో సమానం అని ప్రియాంక.. సచిన్ ను ఒప్పించిందని’ ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే దీన్ని జీర్ణించుకోలేని అశోక్ గెహ్లాట్ అడుగడుగునా సచిన్ పైలెట్ ను తొక్కేస్తున్నాడు. సచిన్ రాజస్థాన్ సీఎం కాకుండా ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని సైతం అశోక్ వదులుకొని అసమ్మతి రాజేశారు.ఈ క్రమంలోనే బీజేపీ అశోక్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందన్న ఆరోపణలున్నాయి. ఆ టైంలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే 10 కోట్లు ఇవ్వడానికి బీజేపీ మొగ్గు చూపిందన్నారు. ఇక ఇదే బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు చొప్పున చెల్లిస్తామనడంపై సంచలనమైంది. రాజస్థాన్ ఎమ్మెల్యేతో పోల్చితే తెలంగాణ ఎమ్మెల్యేలే ఖరీదా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి

  • Related Posts

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

    Spread the love

    Spread the loveజనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు