ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను సోషల్ మీడియా ప్రచార విభాగం పబ్లిసిటీ విభాగం పార్టీ అనుబంధ విభాగాలు ఇలా అన్నింటికీ అధ్యక్షులను కూడా నియమించారు.
మరోవైపు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పథకాల గురించి ప్రజలకు వివరించి తమకు మళ్లీ ఓట్లేసి గెలిపించాలని అర్థిస్తున్నారు.అయితే కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు చురుగ్గా ఉండటం లేదని సమాచారం. అలాగే మరికొన్ని చోట్ల జిల్లా అధ్యక్ష పదవులు తమకొద్దని.. తమను తప్పించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి.కారణాలు ఏవైనా వైసీపీలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారిలో ఏకంగా 8 మందికి ఉద్వాసన పలికారు. వీరి స్థానాల్లో కొత్తగా 8 మంది వచ్చారు. అదేవిధంగా కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లను కూడా సీఎం జగన్ తప్పించారు. వారి స్థానాల్లోనూ కొత్తవారిని నియమించారు.ఇప్పుడీ మార్పులు వైసీపీ వర్గాల్లో కలకలం సృష్టించాయి
జిల్లా అధ్యక్షుల కొత్త జాబితా
శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్
విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు
అల్లూరి సీతారామరాజు – కోటగుళ్ల భాగ్యలక్ష్మి
విశాఖపట్నం – పంచకర్ల రమేష్
అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
కాకినాడ – కురసాల కన్నబాబు
కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
తూర్పుగోదావరి – జక్కంపూడి రాజా
పశ్చిమగోదావరి – చెరకువాడ శ్రీరంగనాథ రాజు
ఏలూరు – ఆళ్ల నాని
కృష్ణా – పేర్ని నాని
ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు
గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్
బాపట్ల – మోపిదేవి వెంకటరమణ
పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం – జంకె వెంకటరెడ్డి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
కర్నూలు – బీవై రామయ్య
నంద్యాల – కాటసాని రాంభూపాల్రెడ్డి
అనంతపురం – పైలా నరసింహయ్య
శ్రీసత్యసాయి జిల్లా – మాలగుండ్ల శంకరనారాయణ
వైఎస్సార్ కడప – కొట్టమద్ది సురేష్బాబు
అన్నమయ్య – గడికోట శ్రీకాంత్రెడ్డి
చిత్తూరు – కె నారాయణస్వామి
తిరుపతి – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి