యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’. గత కొంత కాలంగా మాసీవ్ సినిమాలతో తనదైన పంథాలో ఆకట్టుకుంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్న తెరకెక్కించిన ‘RRR’లో భీమ్ గా నటించి వరల్డ్ వైడ్ గా వున్న అన్ని వర్గాల భాషలకు చెందిన ప్రేక్షకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు. స్కాట్ బంగ్లాలోకి వ్యాన్ లో జంతువులతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులని హంట్ చేస్తోంది.
హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ సీన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే అవాక్కవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీని జాపన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ భారీ వసూళ్లని రాబడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రాజమౌళితో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి సినిమాకు భారీ ప్రమోషన్స్ చేశారు.
ఈ టూర్ లో ఎన్టీఆర్ చరణ్ కు మించి మరింత స్టైలిష్ గా కనిపించాడు. గత కొంత కాలంగా ఎన్టీఆర్ మేకోవర్ డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చమని అభిమానులు కోరుకుంటున్నారు. అది జపాన్ పర్యటనలో కనిపించింది. ఫ్యాన్స్ అభ్యర్థనని గుర్తు పెట్టుకున్న ఎన్టీఆర్ తాజాగా తన మేకోవర్ ని మార్చేసి షాకిచ్చాడు. ‘RRR’ తరువాత వరుస కమర్షియల్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వ్యవహరిస్తుంటే తన తదుపరి సినిమా కోసం వేచి చూసిన ఎన్టీఆర్ తాజాగా తను కూడా స్టార్ట్ చేశాడు.
‘RRR’తో వచ్చిన క్రేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం మొదలు పెట్టాడు. ఫేమస్ ఫ్రెష్ మీట్ సీ ఫుడ్ బ్రాండ్ అయిన లైసియస్ కు ఎన్టీఆర్ తాజాగా ప్రచార కర్తగా సైన్ చేశాడు. దీని కోసం తొలి కమర్షియల్ యాడ్ లో నటించాడు. ఇందు కోసం ఎన్టీఆర్ మేకోవర్ ని మరింత డిఫరెంట్ గా మార్చేయడం విశేషం. మంగళవారం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్.. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.ఎన్టీఆర్ సూట్ ధరించి క్లాసీ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్న పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ స్టిల్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పుల్ స్వీంగ్ లో వున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
We stumbled over here different page and thought I might check things out.
I like what I see so now i’m following you. Look forward to looking at your web page for a second time.