జనసముద్రం న్యూస్, డిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎల్ కే అద్వానీని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ కూడ చేశారు.
“అద్వానీ జీ నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. భారతదేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమైనది. ఆయన దార్శనికత మరియు మేధస్సు భారతదేశం అంతటా ఆయనకు కీర్తిఖ్యాతులు గడించాయి. భారతీయ జనతా పార్టీని నిర్మించడంలో, బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అసమానమైనది. ఆయనకు ఆరోగ్యంతో కూడిన దీర్గాయిస్సు ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.”
భారతీయ జనతా పార్టీ సహా వ్యవస్థాపకులైన ఎల్ కే అద్వానీ మంగళవారం 95 వ సంవత్సరంలోకి ప్రవేశించారు. భారత ఏడవ ఉప ప్రధానిగా, కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా, బొగ్గు గనుల శాఖా మంత్రిగా, సమాచారా శాఖా మంత్రిగా, లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా భారతదేశానికి ఆయన ఎనలేని సేవలు అందించారు.