మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ నవంబర్.15
మహబూబాబాద్, జిల్లా లో
నేడు ప్రపంచ డయాబెటిస్ డే
మధుమేహం.. (డయబెటిస్ లేదా షుగర్) వ్యాధి వేగంగా విస్తరిస్తోందని, దీని విషయంలో నియంత్రణ కోల్పోతే కళ్లు దెబ్బతింటాయని. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి కార్యాలయ ఆవరణలో ప్రపంచ డయబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులలో లివర్, క్లోమగ్రంధి పనితీరు మందగించడం జరుగుతుందని, షుగర్ అధికమైనప్పుడు మానని పుండ్లు ఏర్పడి రక్తప్రసరణ తగ్గి కాలివేళ్లు, కాలును మోకాలి వరకు తీసేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని అంతేకాక బీపీ కూడా వస్తుందని ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 1991 నుంచి నవబంర్ 14వ తేదీని వరల్డ్ డయాబెటిస్ డేగా ప్రకటించిందని ఆయన తెలిపారు.
జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని. జిల్లాలో ఇప్పటి వరకు 20,773 మందికి చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ, ఈ సం వత్సరం థీమ్ గా జీవిత దశలలో మధుమేహం అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే..
షుగర్ వ్యాధిగ్రస్తులు నిత్యం అప్రమత్తంగా ఉం డాలని. లేకుంటే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు, దాని ఫలితంగా గుండెపోటు రావోత్సాని. పక్షవాతం బారిన పడొచ్చుఅని తెలిపారు. వ్యాధి ఉన్న ప్రతి నలుగురిలో ఐదేళ్ల తర్వాత కంటి రెటీనా దెబ్బతినే అవకాశం ఉందని దీనినే డయాబెటిస్ రెటినోపతి అంటారని ఇందు వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పేరుకొన్నారు.
అసంక్రమణ వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం మారిన ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, శారీరకశ్రమ లేకపోవడం, కంప్యూటర్, టీవీలకు
అతుక్కుపోతుండటం వల్ల ఊబకాయం వచ్చి తద్వారా షుగర్ కూడా వస్తోందని, అలాగే ఒత్తిడి కూడా మరో కారణం అని వంశపారంపర్యంగా రావొచ్చు అని తెలిపారు.
క్లోమగ్రంధిలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగ డంలో హెచ్చు తగ్గుల వల్ల తిన్న ఆహార పదార్థాలు చక్కెరగా మారి రక్తంలో కలిసే ప్రక్రియలో ఆటం కాలు ఏర్పడి షుగర్ బారిన పడుతున్నారన్నారు.
ప్రధాన లక్షణాలు
ఎక్కువగా దాహం. ఆకలి వేయడం, నీరసం, తరచూ మూత్రానికి వెళ్లడం, బరువు తగ్గడం, కొన్ని సందర్భాల్లో కంటి చూపు మందగించడం, గాయాలు త్వరగా మానకపోవడం, ఎక్కువ సేపు నిద్రపోవడం లాంటివి ప్రధాన లక్షణాలుగా వుంటాయని జబ్బు వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మేలని, అందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని శీతల పానీ యాలు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థా లకు దూరంగా ఉండాలని. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలని. సకాలంలో నిద్రపోవాలని. పచ్చని ఆకు కూరలు, కాయకూరలు, పప్పులు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని రీఫండ్ ఆయిల్స్ కు బదులు ఆరోగ్యకరమైన నూనెలు వాడాలని. సాంతంగా గానుగ పట్టించిన నూనెలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన తెలిపారు.
ఈ సమావేశములో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాగేశ్వర్ రావు, డాక్టర్ లక్ష్మి నారాయణ, డాక్టర్ ప్రత్యూష, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, సిహెచ్‌ఓ సక్కుబాయి, ఆరోగ్య విద్యా బోధకులు, గీత, శారద, రామకృష్ణ, లోక్య, ఎన్‌హెచ్‌ఎం డిపిఓ నీలోహన, అశోక్, ప్రశాంత్, రమేశ్, కవిత తదితరులు పాల్గొన్నారు.





