
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.02)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని బాలుర ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ లు మరియు నోట్ బుక్స్ పంపిణి చేయడం జరిగింది.విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని పెంచి వారిని ప్రోత్సహించటకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని హైదరాబాద్ చాప్టర్ మేనేజర్ మెంగ అర్వింద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ నాయకులు వి.హనుమాన్,శ్రీశైలం,జనార్ధన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.