
జనసముద్రం న్యూస్ కరీంనగర్, జూన్ 18
- కరీంనగర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు మంగళవారం స్టైఫండ్ చెల్లించాలన్న డిమాండ్‌తో నిరసనకు దిగారు. కాలేజీ ప్రాంగణంలో జమవిన వారు, మేనేజ్‌మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- వైద్య విద్యను అభ్యసిస్తున్న తమకు ప్రభుత్వం నుండి మంజూరైన స్టైఫండ్‌ను కాలేజీ మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు విడుదల చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నప్పటికీ తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు.
- తక్షణమే సమస్య పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను విడుదల చేయాలని మేనేజ్‌మెంట్‌ను డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధికారుల జోక్యం ద్వారా సమస్య త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరుతున్నారు.